A9 న్యూస్ ప్రతినిధి:
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యావసరాల కోసం పాఠశాల పూర్వ విద్యార్థులు 2001-02 ఎస్సేసి మిత్రబృందం వారు సుమారు 30వేల రూపాయల విలువగల స్మార్ట్ టీ.వి కొని అందజేశారు. ఈ బహుకరణ సందర్భంగా ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ సాధు శ్రీకాంత్ మాట్లాడుతూ నేటికాలంలో సాంకేతిక సాధనాల వాడకం అనివార్యమని, వాటి వినియోగం వల్ల విద్యార్థుల అభ్యసన మెరుగవుతుందని తెలిపారు. ఈ భేటీ అందజేసినందుకు పూర్వ విద్యార్ధి టీంకు కృతజ్ఞతలు తెల్పారు. ఇట్టి కార్యక్రమంలో ధర్మపురి పాఠశాల సముదాయ హెడ్మాస్టర్ కొలిచాల శ్రీనివాస్, రాజారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావులపెల్లి వెంకటరమణ, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు, పాఠశాల పూర్వ విద్యార్థులు 2001-02 SSC బ్యాచ్ బృందం అడ్డగట్ల మహేష్, గునిషెట్టి సతీష్, మచ్చ మల్లేష్, నేరెళ్ళ తిరుపతి, అద్దగట్ల సూర్యకిరణ్, మొగిలి తిరుపతి, జెల్ల కిరణ్, పుట్ట నవీన్, అయ్యెరి శ్రీనివాస్, అడ్వాల సతీష్, కొండవేణి పెద్దన్నా, గుగ్గిళ్ళ తిరుపతి, బొర్లకుంట రాజమౌళి, బొక్కేనపెల్లి రాజేందర్, సిద్ధం అశోక్, వేముల పితంబర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం బండారి సతీష్, చుంచు తదితరులు పాల్గొన్నారు.