A9 న్యూస్ ఆర్మూర్:
*భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత గొప్పది…
*శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో ఘనంగా సర్వేపల్లి రాధ కృష్ణన్ జయంతి వేడుకలు…
ఆర్మూర్ పట్టణం లోని టీచర్స్ కాలనిలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని పిల్లలు తమకు ఇష్టమైన సబ్జెక్టు లోని పాఠ్యాంశాలను కింది స్థాయి పిల్లలకు బోధించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ ముద్ర కోల మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత విశిష్టమైనది, సమున్నతమైనది అని, గౌరవప్రదం అయినది, అటువంటి గురువులను ఆరాధించుకునే రోజే సెప్టెంబర్ 5 అని, తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులది అని ఒక వ్యక్తి, సమాజం, జాతి నడవడికకు, నడతకు, పురోగతికి శ్రేయస్సుకు మార్గదర్శనం ముమ్మాటికీ గురువే అని,
అటువంటి విశిష్టత కలిగిన సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం జరుపుకుంటున్న ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు శుభాభి వందనాలు తెలిపారు. వ్యక్తిత్వ వికాసానికైనా, దేశ సంగ్రతకైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం.
అటువంటి గురువుల ఆశీర్వాదాలతోటే గురువులను పూజించేందుకు ఉద్దేశించ బడిన రోజు దివంగత భారత తొలి ఉప రాష్ట్రపతి, మలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన శుభసందర్బాన్నీ పురస్కరించుకుని టీచర్స్ డే ను నిర్వహించు కోవడం యావత్ భారతదేశానికి తలమానికం. చైనా, పాకిస్తాన్ లతో జరిగిన యుద్ధ సమయంలో నాటి ప్రధానులకు మార్గదర్శనం చేసిన మహోన్నతుడు. ఉపాధ్యాయుడిగా మొదలు పెట్టిన జీవితం ఆంద్రా, బనారస్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నుండి సోవియట్ కు రెండో రాయబారిగా బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్ జన్మదినాన్ని బావి తరాలకు గుర్తుండి పోయేలా గురుపూజోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడం వారి అడుగు జాడల్లో నడవడం ద్వారా భావి తరాలకు మంచి దిశా నిర్దేశాలు చేయడం ద్వారా యువతలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమము లో పాఠశాల మేనేజ్మెంట్ భాను తేజ, ప్రిన్సిపల్ వినోద్ కుమార్, మాతాజీ లు శైలజ ముద్ర కోల, మంజుల, సిందూజ, లత, శైలజ, ప్రియాంక, నిహారిక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.