*నిరుపేదల హక్కుల సాధన సమితి మద్దతు.
ఎ9 న్యూస్: ఉమ్మడి మెదక్, జూలై 8:
అఖిలభారత కార్మిక సంఘాలునిర్వహిస్తున్న జూలై, 9 ,2025 .సార్వత్రిక సమ్మెకు మా నిరుపేదల హక్కుల సాధన సమితి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తుంది.
ప్రియమైన ప్రజలారా ,ప్రజాస్వామిక వాదులారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఫోర్త్ లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి .కార్మిక అసంఘటితరంగా కార్మికులు తీసుకున్న న్యాయమైన డిమాండ్లకు మా నిరుపేదాకుల సాధన సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.
1.స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
2.కనీస వేతనం 26 వేలుగా ఇవ్వాలి.
3.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం కాకుండా ఆపాలి.
4.కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి.
5.రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
6.రవాణా రంగ కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలి.
7.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి.
8.సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు రావలసిన క్లెయిమ్స నువెంటనే చెల్లించాలి,9మున్సి పల్ కార్మికుల జీవితాన్ని వారి భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
10.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు ఉచిత ఎరువులు సరఫరా చేయాలి తెలంగాణలో కాలేశ్వరం నుండి మల్లన్న సాగర్ కు వస్తున్న గోదావరి నీటి నీ రైతు పొలాల్లోకి అందివ్వాలి.
11.అసంఘటిత రంగ కార్మికుల కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి 12 సిపిఎస్ ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి.
13 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన టైంలో జీతభత్యాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నందుకు కార్మికులు కర్షకులు తమ బిడ్డల చదువుల కోసం హాస్పిటల్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులు కొంతమంది ఫైనాన్స్ వాళ్ళు నూటికి రెండూ లేక మూడు రూపాయల మిత్తి కాకుండా వచ్చిందే తడువుగా ఐదు నుంచి పది రూపాయల మిత్తిని (వడ్డీ) ముక్కు పిండి వసూలు చేయడమే కాకుండా వారి దగ్గర తాకట్టు పెట్టుకున్న ఇండ్లను భూములను కొద్దిపాటి బంగారాన్ని కూడా టైం కు డబ్బులు కట్టకపోతే గుంజుకొని వారిని నడిబజార్లోకి ఈడుస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక వడ్డీ తీసుకొని ప్రజలను బాధలకు గురి చేస్తున్నాం ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అలాంటి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళను మూసేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పై డిమాండ్స్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక దర్శక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2025 జూలై 9వ తేదీన అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులు కర్షకులు, విద్యార్థి మేధావులు ,ఉద్యోగులు ,ప్రజలు, యువతీ యువకులు, మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సార్వత్రిక సమ్మెకు నిరుపేద కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుంది అని అన్నారు.