*ఇక దాబా హోటళ్లలో సిట్టింగ్ లు నిషేధo.
*పకడ్బందీగా అమలు తూప్రాన్ డిఎస్పి అ ఆధ్వర్యంలో సమావేశం .
A 9 న్యూస్ ,తూప్రాన్, మెదక్ జూన్ 3 :
తూప్రాన్ బైపాస్ రోడ్డులో నెలకొల్పిన దభా హోటళ్లలో మద్యం సేవించకుండా కఠిన చర్యలు అమలు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ జనార్ధన్ గౌడ్ తెలిపారు. గురువారం ఉదయం తూప్రాన్ మండలం లోని పలు దాబా హోటళ్ల యాజమానులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీచేశారు. ఇది మందు బాబులకు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు కేవలం మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగానే యాక్సిడెంట్ లు జరిగినట్లు పలు సర్వేల ద్వార తేట తెల్ల మైనందున పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించి దాబా హోటళ్లలో మద్యం సిట్టింగ్ లు పూర్తిగా నిషేధించి ప్రమాదాలను నివారించడానికి ఉపక్రమించారు. ఇక దాబా హోటళ్లలో సిట్టింగ్ లు నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తూప్రాన్ డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి మీద ఉన్న దాభాల యజమానులు ఇందుకు అంగీకరించి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగ కృష్ణ, ఎస్.ఐ లు శివానందం, యాదగిరి, పోలీస్ సిబ్బంది తోపాటు దాబా హోటళ్ల యాజమానులు పాల్గొన్నారు.