A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
భీంగల్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా సందీప్ నియమితులై సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్లిన ఎస్సై మహేష్ స్థానంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్సై సందీప్ సీఐ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు
ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ భీంగల్ పట్టణంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రతి స్థాయిలో చర్యలు తీసుకుంటానని తెలిపారు ప్రజల సహకారంతో నేరాల నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తానని యువత భవిష్యత్‌ను రక్షించే దిశగా చట్ట పరంగా కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు