నిజామాబాద్ A9 న్యూస్:
బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ చిన్నారుల మరణ వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.