A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన రోటరీ భవన్‌ను రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ పూజాకార్యక్రమాలతో ప్రారంభించగా, పి.డి.జి హనుమంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, 35 ఏళ్ల చరిత్ర ఉన్న రోటరీకు ఇప్పటి వరకూ సొంత భవనం లేక, ఇతర హాళ్లలో కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చిందని, ఇకపై అన్ని కార్యక్రమాలు తమ సొంత భవనంలో నిర్వహించనున్నట్టు చెప్పారు.
భవన నిర్మాణానికి సభ్యుల సహకారం వెలకట్టలేనిదని తెలిపారు. ముఖ్య అతిథి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, చాలాకాలంగా నిలకడలేని నిర్మాణం నేడు పూర్తయ్యిందని, అధ్యక్షుడు రజనీష్ కిరాడ్, సెక్రటరీ రాస ఆనంద్ కృషిని కొనియాడారు.
భవన నిర్మాణానికి భూమి అందించిన మోత్కూరి లింగ గౌడ్, మొదటి దశ నిర్మాణం చేపట్టిన దాసరి సునీల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాంధీ, గంగారెడ్డి, పుష్పకర్ రావు, విజయసారథి గోపి, తులసి, చలిమెల రాజేందర్, రాధాకిషన్, ఖాన్దేశ్ సత్యం, పిట్ల శశిధర్, కోట నరేష్, రాజు ల్యాబ్ సభ్యులు పాల్గొన్నారు.