నేటి నుంచి తెలంగాణ లో భారీ వర్షాలు…..

On: Wednesday, July 1, 2026 12:19 PM

 

హైదరాబాద్:జులై 02

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండ గా.. మరికొన్ని జిల్లా ల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజా గా.. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు వర్షా లపై కీలక విషయా న్ని వెల్లడించారు. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని, వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నైరు తి రుతుపవనాలు విస్తరించాయి. మొన్నటి వరకు కాస్త నెమ్మదిగా ముందుకు కదలిన రుతుపవనాలు.. గత నాలుగు రోజులుగా వేగం పుంజుకున్నాయి. ఈ కారణగా రాబోయే 24గంటల నుంచి 72గంటల వ్యవధిలో తెలంగాణతోపాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోద య్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు.. ఈ వారంలో బంగాళా ఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్ప పీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

వాతావరణ శాఖ అధికారులు అంచనా ప్రకారం.. జులై 1వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోద య్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు బుధవారం అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షా లు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారు లు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని, తగిన జాగ్రత్త లు తీసుకోవాలని అధికారులు సూచించారు.

01 Jul 2026

Leave a Comment