A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్లో ఇటీవల జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పీ), బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏసీపీ, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విహెచ్పీ నాయకుల కథనం ప్రకారం, తల్లిదండ్రులు మరియు విద్యాశాఖ అనుమతి లేకుండా హిందూ విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ అమీర్ ఉర్దూ, కల్మా, నమాజ్‌కు సంబంధించిన అంశాలను బోధించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి, ప్రిన్సిపాల్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, ఉపాధ్యక్షుడు ప్రేమ్, సహ కార్యదర్శి కరణ్, బజరంగ్ దళ్ ప్రముఖ్ ప్రవీణ్, సాయి, అరవింద్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.








