A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి:
https://youtu.be/yY2XJUWOW4o?si=RSgEHo0M8T4ETH1d
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యారు. వారిలో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు.