Jul 13, 2025,
తెలంగాణ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ విజయమని CM రేవంత్ అన్నారు. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ‘రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా చేశాం. ఇది దేశానికే ఉత్తమ మోడల్. ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారు. ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచాం’ అని వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బీసీ నేతలు సీఎంను కలిసిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు.