A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐ.పి.ఎస్. మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు స్వయంగా విని సంబంధిత ఎస్.ఐ. సి.ఐ.లకు ఫోన్ ద్వారా నిర్దేశాలు ఇచ్చారు ప్రజలు స్వేచ్ఛగా ఎలాంటి మూడో వ్యక్తి లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు
ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తూ పరిష్కరిస్తున్నామని ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీసు శాఖ లక్ష్యమని కమిషనర్ వెల్లడించారు