*ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ డివిజనల్ ట్రెజరీ ఆఫీసులో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా పనిచేసిన నీరడి రాములు ఉద్యోగ విరమణ సందర్భంగా పెర్కిట్ ఎం.ఆర్. గార్డెన్‌లో ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి దశరథ్ టీఎన్జీవోస్ మారుతి టీజీవోస్ అలుక కిషన్ పీఆర్టీయూ నేత పొద్దుటూరి మోహన్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు. రాములును దంపతులతో కలిసి శాలువాలు పూలమాలతో సన్మానించి ఆయన సేవలను కొనియాడారు
జిల్లా ట్రెజరీ అధికారి మాట్లాడుతూ – రాములు 40 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో అంకితభావంతో విధులు నిర్వహించారని తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి ట్రెజరీ సంఘంలో నాయకత్వం వహించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కార్యకలాపాల్లో భాగస్వామ్యం సహాయ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా సేవలు ప్రశంసనీయమని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతలు రాములు సహృదయంతో చిరునవ్వుతో సహచరుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేశారు ఉమ్మడి జిల్లాల నుండి పలువురు నాయకులు ఉద్యోగులు విశ్రాంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.