తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక :

On: Tuesday, July 1, 2025 11:20 AM

 

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) *ఎల్లో అలర్ట్* జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

*వర్షాల విస్తరణ:

మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. *ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి* జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

*ప్రాంతాల వారీగా వర్షపాతం అంచనా:

* ఎరుపు రంగుతో గుర్తించిన ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాలు:నేటి నుండి మూడు రోజుల పాటు తరచుగా భారీ వర్షాలు, ముసురు వాతావరణం.

* *నీలం రంగుతో గుర్తించిన ప్రాంతాలు:* సాయంత్రం నుండి రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు.

* *ఆకుపచ్చ రంగుతో గుర్తించిన ప్రాంతాలు:* తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.

*హైదరాబాద్ వాతావరణం:

హైదరాబాద్ నగరంలో నేడు సాయంత్రం నుండి రాత్రి వరకు ముసురు వాతావరణంతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటిపూట ఆకాశం మేఘావృతమై చినుకులు పడే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

23 Jul 2025

Leave a Comment