ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యెల్దుర్తి యందు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ సంబరంగా నిర్వహించబడింది. పాఠశాల ఆవరణం ఆడపడుచుల ఉత్సాహంతో, పూల సౌరభంతో కళకళలాడింది.
విద్యార్థినులు మరియు ఉపాధ్యాయినీలు సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మను పేర్చి, పరిపాటి ప్రకారం పాటలు పాడుతూ చక్కటి ఆటలతో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీలు అర్చన, అమూల్య, నవనీత, జయసుధ, వాణిశ్రీ, శైలజ, పద్మజ, సునీత, రేణుకదేవి, సంతోష తదితరులు విశేషంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్రమ్ రెడ్డి గారు, సీనియర్ ఉపాధ్యాయులు బి. సాంబయ్య, వెంకటస్వామి, శ్రీనివాసరావు, నర్సింహారెడ్డి, చార్లెస్, వెంకటరెడ్డి, రాము, ధనరాజ్, విజయమోహనరాజ్, రాజు, మహేష్ మరియు ఇతర ఉద్యోగులు, విద్యార్థులు భాగస్వాములయ్యారు.
ఈ విధంగా బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం పాఠశాల ఆచార వ్యవస్థను ప్రతిబింబించడంతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక విలువలు, భౌతిక సామరస్యం నేర్పే దిశగా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.







