ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 2 :
గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ వాళ్ళ మల్లేష్ గౌడ్ అన్నారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో మంగళవారం వివిధ పార్టీలకు చెందిన సుమారు 25 మంది యువకులు అగ్రవరం శ్రీకాంత్, దేవుని భాను ప్రసాద్, సందీప్ గౌడ్, అగ్రహారం గణేష్, అగ్రహారం రాజు, కర్రే రాజు, విగ్నేష్, దేవనూరి గణేష్, బాలయ్య, యాదగిరి, కొత్తూరు కిషన్ తదితరులు బిజెపిలో చేరారు. వారిని జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాపన్న గారి శ్రీకాంత్, శివకుమార్ గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాసాన్పల్లి నగేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు, సోషల్ మీడియా కన్వీనర్ దేవనూరి సాయి, సీనియర్ నాయకులు ముక్క యాదగిరి, ఆర్ఎస్ఎస్ పోచయ్య రాజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి భూత్ అధ్యక్షులు గౌర గళ్ళ రాములు, రవి, శ్రీనివాస్ రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.







