*అనుమతి ఉందా? లేదా? అనే అయోమయంలో పడిపోయిన యువకులు…
*డీజే బుకింగ్స్ తో గందరగోళం – పోలీసుల పర్యవేక్షణ కఠినం….
*శబ్ద కాలుష్యం నియంత్రణలో భాగంగా అధికారుల అప్రమత్తత…
*సౌండ్ సిస్టమ్స్ పై ప్రత్యేక నిఘా – పోలీసుల కఠిన హెచ్చరికలు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా డీజేల వినియోగంపై అనుమతి ఉందా లేదా అన్న సందేహంలో యువత పూర్తిగా అయోమయంలో పడిపోయారు. ఒకవైపు అధికారికంగా ఎలాంటి అనుమతి లేదని చెబుతుండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లు జరగడం గమనార్హం.
యువతలో కొందరు డీజేల కోసం ముందస్తు బుకింగ్స్ చేసుకున్నప్పటికీ, అనుమతుల స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో “డీజేలకు అనుమతి ఉందా లేకపోయిందా..?” అన్న సందేహం చర్చనీయాంశంగా మారింది.
పోలీసు శాఖ కఠినంగా పర్యవేక్షిస్తోందని, శబ్ద కాలుష్యం నియంత్రణ చట్టాల ప్రకారం డీజేలకు కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, పండుగ ఉత్సాహంలో యువత డీజే లపై ఆధారపడిపోవడం గమనించదగ్గ విషయం.
స్థానిక పెద్దలు, పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్స్ వాడకపోవాలని, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. కానీ యువత మాత్రం చివరి నిమిషం వరకు డీజేల పై స్పష్టత కోసం వేచి చూస్తున్నారు.







