CEIR పోర్టల్ సహకారంతో పోయిన సెల్ ఫోన్ లను తిరిగి స్వాధీనం – బాధితులకు అప్పగించిన సీఐ సత్యనారాయణ గౌడ్…

On: Tuesday, December 23, 2025 9:57 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన సెల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి, సోమవారం బాధితులకు తిరిగి అప్పగించారు.

 

పోలీసుల సమర్థవంతమైన చర్యలతో మొత్తం 03 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, సంబంధిత యజమానులకు రాసరి రాధ, సయ్యద్ సమీర్, రాపత్రి రమేష్ అందజేశారు.

ఈ సందర్భంగా బాధితులు ఆర్మూర్ పట్టణ పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ సెల్ ఫోన్లు పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజల భద్రత, సేవలే లక్ష్యంగా ఆర్మూర్ పోలీసులు ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగిస్తూ ముందుకు సాగుతున్నారని సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

14 Mar 2026

Leave a Comment