A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా గుర్తించి, సంబంధిత బాధితులకు పోలీస్ శాఖ తిరిగి అప్పగించింది.
ఈ సందర్భంగా బాధితులు సాయి చరణ్, సాజిద్ బేగం, చింతల నవ్య లకు వారి మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించబడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని సిఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవే తమ కర్తవ్యమని, పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే, మొబైల్ పోయిన ప్రతి పౌరుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే CEIR పోర్టల్ (https://ceir.gov.in) ద్వారా మొబైల్‌ను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. ఈ చర్యల ద్వారా మొబైల్ ట్రేసింగ్ సులభమవుతుందని తెలిపారు.