హైదరాబాద్:నవంబర్ 07
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం ఆసన్నమవు తోంది. ఈనెల 11వ తేదీన జూబ్లీహిల్స్ బైపోల్స్ జరగ నున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ నియోజకవ ర్గం మొత్తం మద్యం దుకా ణాలు బంద్ కానున్నాయి. బైపోల్స్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజ కవర్గం పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలు మూత పడనున్నాయి
జూబ్లీ హిల్స్ పరిధిలో ఎన్నికలు11వ తేదీన జరగనుండగా.. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ మద్యం దుకాణాలు ఓపెన్ కానున్నాయి. ఇక ఈనెల 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఇక ఆ రోజు కూడా నియోజకవర్గం మొత్తం మద్యం దుకాణా లను బంద్ చేయనున్నారు.
మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా ఖరీదుగా మారిందని వార్తలు వెలువ డుతున్నాయి. ప్రధానంగా ఇందులో విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరు తుండగా.. సిట్టింగ్ సీటును ఎలాగైనా దక్కించుకోవా లని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక హైదరాబాద్‌లో పట్టు ఉందని నిరూపించుకునేం దుకు తాము గెలిచితీరాల నే పట్టుదలతో బీజేపీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది.







