గ్రామాన్ని మారుస్తాం.-ప్రజలకు న్యాయం చేస్తాం……  

On: Sunday, December 14, 2025 6:15 AM

 

జి.జి నడుకుడా సర్పంచ్ పోరులో పెగ్గర్ల గంగారాం

డొంకేశ్వర్ మండలం ,జి.జి నడుకుడా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పెగ్గర్ల గంగారాం గ ఉంగరం గుర్తుతో బలంగా బరిలో నిలిచారు. గతంలో ప్రజల కోసం పనిచేసిన అనుభవం, రాజకీయ అవగాహన, సమస్యలపై పట్టు ఉన్న నాయకుడిగా గ్రామమంతా గుర్తింపు పొందారు. మాట కాదు–చర్యే తన విధానం అని స్పష్టం చేశారు.

గ్రామంలో విద్య, వైద్యం పటిష్టం చేస్తానని, ప్రభుత్వ పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి ఒక్కరూ మిస్ కాకుండా అందేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తానని గంగారాం గట్టిగా ప్రకటించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి, అధికారుల తలుపులు తట్టే అవసరం లేకుండా గ్రామంలోనే పరిష్కారం చూపిస్తానన్నారు.

అభివృద్ధి పనుల్లో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన, ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికే ఖర్చు చేసే దృఢ సంకల్పం తనదని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని, ఐక్యతతో జి.జి నడుకుడా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామ భవిష్యత్తు కోసం, నిజమైన మార్పు కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి పెగ్గర్ల గంగారాం ని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు ఆయన గట్టి విజ్ఞప్తి చేశారు.

13 Mar 2026

Leave a Comment