
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సొంత గ్రామంలో క్రీడాలు…
ఎ9 న్యూస్ :మాసాయిపేట, మెదక్ జనవరి 17:
ఈ నెల 28 నుండి 31 వరకు మండల కేంద్రం లో జరిగే 2వ సి యం కప్ 2025 క్రీడలను విజయవంతం చేయాలని మండల అభివృధి అధికారి శ్రీ విఘ్నేశ్వర అన్నారు. సి యం 2025 క్రీడల నిర్వహణలో భాగంగా ఈ రోజు మండల కేంద్రం లో టార్చ్ ర్యాలీ ని ప్రారంభించారు.పల్లె నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశం తో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2వ సి యం కప్ 2025 లో వివిధ క్రీడలలో పల్లె నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు విఘ్నేశ్వర తెలిపారు.ఈ కార్యక్రమ లో మాసాయిపేట గ్రామ ప్రథమ పౌరుడు వీరన్న గారి సర్పంచ్ కృష్ణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు దోహదపడతాయని అన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్య మరియు ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహసీల్దార్ శ్రీమతి జ్ఞాన జ్యోతి మండల విద్యాధికారి లీలావతి స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు మధు సూదన్ రావు మాసాయిపేట ఉప సర్పంచ్ లక్ష్మణ్ పోతన పల్లె సర్పంచ్ ఉప్పల ప్రశాంత్ నడిమి తండా సర్పంచ్ రాములు స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్ శర్మ వివిధ గ్రామాల పంచాయతి కార్యదర్శులు,ఉపాధ్యాయులు,యువకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.








