వార్-2′ ప్రీ-రిలీజ్ వేడుక నేడు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు….

On: Sunday, August 10, 2025 8:45 AM

 

Aug 10, 2025,

తెలంగాణ : జూనియర్‌ ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘వార్‌-2’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక ఆగస్టు 10న హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కేవీబీఆర్‌) స్టేడియంలో జరగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఈ వేడుకకు భారీసంఖ్యలో ప్రజలు హాజరవుతారని వాహనదారులు కేవీబీఆర్‌ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

14 Mar 2026

Leave a Comment