అభయ హస్తం కోసం ఎదురుచూపులు…..

On: Thursday, September 11, 2025 5:33 PM

 

జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన రంగు అజయ్ గౌడ్ అనే గల్ఫ్ కార్మికుడు 2016లో కువైట్ లో పని చేస్తున్న క్రమంలో ప్రమాధవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి నరం దెబ్బ తినడంతో బెడ్డుకే పరిమితమాయ్యాడు, ఇప్పటివరకు ఎవరు ఏ గౌర్నమెంట్ కూడా చిల్లి గవ్వ కూడా ఆర్ధిక సహాయం చేయలేదు పెళ్లి కానీ వయసులోనే తల్లికి భారమయ్యాడు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నరం దెబ్బ తిన్న కారణంగా లేచి తిరిగే అవకాశం లేదని ఆపరేషన్ కి 20లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు, ఈ సమయంలో తల్లికి అండగా ఉండాల్సిన అజయ్ భారంగా ఉండటం అందరి హృదయాల్ని కల్చివేస్తుందని స్థానికులు తెలిపారు, ఎవరైనా అజయ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకొని మరియు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడాలని కోరారు.

05 Mar 2026

Leave a Comment