జూబ్లీహిల్స్‌లో జెండా పాతేది ఎవరు..?
హైదరాబాద్:నవంబర్ 10
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి,ఈరోజు ఉదయం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, బొటానికల్ గార్డెన్ లో ఎన్నికల సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పగించారు. ఈ పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
గత ఎన్నికలతో పోలిస్తే గంట సమయం అదనంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58మంది బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది.
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఉప ఎన్నికలో 4లక్షల 1వెయ్యి 365 మంది ఓట ర్లు అర్హులుగా ఉన్నారు. వారిలో 2లక్షల 8వేల 561 మంది పురుషులు, 1లక్ష 92వేల 779మంది మహిళలు, 25మంది ఇతరులు ఉన్నారు.
నియోజకవర్గంలో 18మంది సర్వీసు ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,908 మంది ఓటర్లు వికలాంగులు, 6,859 మంది 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల మొదటిసారి ఓటర్లు ఉన్నారు. 85ఏళ్లు పైబడిన వారు సీనియర్ పౌరుల సంఖ్య 2,134మంది ఉన్నారు. 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో స్టేషన్‌కు 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నెంబర్ 9లో 1,233 మంది ఉండగా… అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ 263లో 540మంది ఉన్నారు. 11 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.







