నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 1:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క, అలాగే బిల్లును ఆమోదించడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ సమాజాన్ని ఉద్దేశించి —
“ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ,స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పొందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.







