వినయ్ రెడ్డి & కో — 100 కోట్ల ఘరానా మోసం… 61 మంది ప్లాట్ బాధితుల అరుపు…..

On: Saturday, December 6, 2025 7:29 PM

 

హైదరాబాద్/ఆర్మూర్, A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి పేరు చెప్పుకుంటూ జరిగిన భారీ స్థాయి ఆర్థిక కుంభకోణంపై 61 మంది ప్లాట్ బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్లకు పత్రం రాశారు.

బాధితుల వాదన ప్రకారం:

వినయ్ రెడ్డి ఆధ్వర్యంలోని పీవీఆర్ ఇన్ఫ్రా సంస్థ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచమ్మ గ్రామం సర్వే నంబర్–53లో ఉన్న 10,240 గజాల భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో ప్లాట్లు ఇస్తామని నమ్మబలికిందని ఆరోపించారు.ప్రతి వ్యక్తి నుంచి 40 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూళ్లు!

మొత్తం 61 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద.

రూ. 40 లక్షల నుండి 60 లక్షల వరకు

మొత్తంగా 100 కోట్లకు పైగా సొమ్ము సేకరించారని బాధితులు చెబుతున్నారు.

ప్లాట్లు వస్తాయని నమ్మి చాలామంది సొంత భూములు, బంగారం అమ్మి, కొందరు వడ్డీకి తీసుకుని డబ్బులు చెల్లించారని వారు వాపోయారు.ఆరేళ్లు గడిచినా ప్లాట్లేమీ ఇవ్వలేదంటూ ఆవేదన ఆరేళ్లు గడిచినా ఎలాంటి నిర్మాణం లేదని, ప్లాట్‌లు ఎప్పుడు ఇస్తారని అడిగితే వినయ్ రెడ్డి “రేపు ఇస్తాం… మాపు ఇస్తాం” అంటూ తప్పించుకున్నాడని బాధితులు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినయ్ రెడ్డి వ్యవహారం మరింత దారుణంగా మారిందని వారు ఆరోపించారు.

“నాకు ముఖ్యమంత్రి అండ ఉంది… ఏం చేసుకుంటారో చేసుకోండి” – బాధితుల ఆరోపణ.బాధితుల ప్రకారం, వినయ్ రెడ్డి వారిని తెగదెంపులు చేస్తూ“నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ ఉంది. నేను ప్లాట్లు ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి…” అని బెదిరించాడని ఆరోపించారు.

నిస్సహాయ స్థితిలో బాధితులు—“ఆత్మహత్య తప్ప మార్గం లేదు”.తమ సంపాదన అంతా పోయి, అప్పుల్లో కూరుకుపోయి, కుటుంబాలతో కలిసి వీధులపాలయ్యామని… ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మార్గం కనిపించడం లేదని వారు పత్రంలో గుండెచప్పుడు వినిపించారు.వినయ్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపు ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్‌చార్జ్ తక్షణం స్పందించి —

* వినయ్ రెడ్డిపై దర్యాప్తు

* నిధుల రికవరీ

* బాధితులకు న్యాయం

చేయాలని బాధితులు అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు.బాధితుల సంఖ్య — 61 మంది,వెంచర్ — పీవీఆర్ ఇన్ఫ్రా,ప్రాంతం — మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, గుండ్లపోచమ్మ గ్రామo.

15 Mar 2026

Leave a Comment