మాసాయిపేట సర్పంచుల ఫోరం మండల నూతన కమిటీకి కృతజ్ఞతలు…
సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వీరన్న గారి కృష్ణారెడ్డి వెల్లడి…
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, డిసెంబర్ 21 :
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నూతన ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఆదివారం నాడు మాసాయిపేట కాంగ్రెస్ నూతన సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నూతన సర్పంచులు సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మాసాయిపేట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా వీరన్న గారి కృష్ణారెడ్డిని నూతన సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాసాయిపేట మండలం సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షు లుగా సౌందర్య భూపతి ఎన్నుకు న్నారు, పోతన్ పల్లి సర్పంచ్ ప్రధాన కార్యదర్శిగా మాధవరెడ్డిని నియమించారు. అని సర్పంచుల ఫోరం మాసాయిపేట మండల అధ్యక్షులు వీరన్న గారి కృష్ణారెడ్డి తెలిపారు. మరియు అన్ని సహకారాల్లో ఎల్లవేళలా ఉంటూ ప్రతి ఒక్కరు నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.








