ఆర్మూర్‌లో గుంతలు పూడ్చిన వీడీసీ బృందం….  

On: Thursday, August 21, 2025 4:17 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి బస్తీ దవాఖాన సమీపంలో వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సమస్యను గుర్తించిన వీడీసీ బృందం వెంటనే ముందుకు వచ్చి గుంతలను పూడ్చే పనులు చేపట్టింది.

గురువారం ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రతినిధులు పిప్పేర శ్యామ్, మల్యాల సాయరెడ్డి పాల్గొని గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేలా వీడీసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పోచంపాడ్ శ్రీనివాస్, వేంపల్లి రాజన్న, పర్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment