గోవింద్ పేట్ గ్రామం, ఆర్మూర్ | తేదీ: సెప్టెంబర్ 6
గురుపూజోత్సవం సందర్భంగా గోవింద్ పేట్ గ్రామంలోని వాణి విద్యానికేతన్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ బి. శ్రీపాల్ మరియు కరెస్పాండెంట్ వై. సంతోష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ :
“ఒక బల్ల, ఒక చాక్ పీస్, ఒక డస్టర్, ఒక బోర్డు, కొన్ని పుస్తకాలతో ప్రారంభమయ్యే ఉపాధ్యాయుడి జీవితం ఎంతోమంది విద్యార్థుల కలలకు రూపాన్ని ఇస్తూ,వారి ఆశయాలకు సారథిగా మారి,నిరంతర విద్యార్థిగా, నిరంతర సాధకుడిగా, నిరంతర ప్రేరకుడిగా చందనం వలె తాను అరిగిపోతూ చుట్టుపక్కల వారిని సుగంధింపజేస్తాడు”అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులపై తమ ప్రేమను పాటలతో, నృత్యాలతో, ప్రసంగాలతో వ్యక్తపరిచారు. చివరగా ఉపాధ్యాయులందరికి పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కారం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.






