Jul 13, 2025,
తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్ లో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కీలక సూచనలు చేశారు. పనులు వేగవంతంగా కొనసాగాలని చెప్పారు.