మెదక్ జిల్లాలో హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి….

On: Tuesday, March 24, 2026 4:53 PM

మెదక్ జిల్లా మాసాపేట మండలం హకీంపేట్ సమీపంలోని హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

అనంతరం శవాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద ఒక మోటార్ సైకిల్ (షైనీ) కూడా లభ్యమైనట్లు సమాచారం.

మృతుడి గుర్తింపును తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశార.రిపోర్టర్ శ్రీకాంత్.

24 Mar 2026

Leave a Comment