A9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క, తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. వినూత్న (11), విదాత్ (8) గ్రీన్ వ్యాలీ కాలనీలో సైకిల్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి పోయిన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.