సంజయ్ బోధి కస్తూరెకు నివాళులు…..

On: Wednesday, September 3, 2025 9:44 PM

 

ఆర్మూర్. సెప్టెంబర్ 03,

భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ ఇంచార్జ్ సంజయ్ బోధి కస్తూరె మృతికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున నివాళులు అర్పించారు. మంగళవారం ఆర్మూర్ అంబేద్కర్ యువజన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘము నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వర్‌పేట్ లింగన్న మాట్లాడుతూ సంజయ్ బోధి తుది శ్వాస వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేశారు.ఆయన నిజాయితీతో భారతీయ బౌద్ధ మహాసభ (బిఎస్ ఐ)లో పనిచేసి సమాజాన్ని మేల్కొలిపారు. నిజామాబాద్, జగిత్యాల ,నిర్మల్ ప్రాంతాల్లో సమతా సైనిక్ దళ శిక్షణ శిబిరాల్లో ఆయన పాత్ర విశేషమైనది. అలాంటి మానవతావాది అకాల మరణం సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షులు పింజ సుదర్శన్, మండల ఉపాధ్యక్షులు,బండ ప్రసాద్ కోశాధికారి, ముకేశ్ బీసీ నాయకుడు,కాపు భోజన్నతో పాటు అనేకమంది పాల్గొని నివాళులు అర్పించారు.

15 Mar 2026

Leave a Comment