హైదరాబాద్:
ప్రఖ్యాత సినీ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు పరామర్శించారు.
హాస్యనటుడు పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు పరమపదించారన్న వార్తను తెలుసుకుని, ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో కుటుంబానికి ధైర్యం చేకూర్చుతూ, తాము వారికి అండగా ఉంటామని తెలియజేశారు.







