ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ – ఆగస్ట్ 12:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల వ్యవసాయ కార్యాలయంలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు అర్హత కలిగి ఉంటే, ఆగస్ట్ 13లోపు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాల్సిందిగా కోరారు.
సోమవారం నాడు 54 దరఖాస్తులు వచ్చాయని, మంగళవారం 69 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తుల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
రైతులు ప్రభుత్వం అందించే రైతు బీమా ప్రయోజనాలను పొందాలంటే, చివరి తేదీలోగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.







