రేపు రిపబ్లిక్ డే: దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్ర అవార్డులు….

On: Sunday, January 25, 2026 3:58 PM

 

హైదరాబాద్:జనవరి 25:

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది, దేశవ్యాప్తంగా పోలీస్ ఫైర్ సర్వీస్, హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ సర్వీసులలో పనిచేసే 982 మంది పోలీసులు, అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదివారం లిస్ట్ ను విడుదల చేసింది…

అలానే రాష్ట్రపతి అవార్డు లకు ఆరుగురు సీబీఐ అధికారులు ఎంపికయ్యా రు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25 మందికి పోలీస్‌ మెడల్స్‌ అందుకో నున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రి వెంకట్‌రెడ్డి,తెలంగాణ గ్యాలెంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. అలానే ఏఎస్పీ ఆర్‌.ఎం.కె. తిరుమలాచారి(ఏపీ)కి ప్రెసిడెంట్‌ మెడల్‌, అదనపు ఎస్పీ జి.ఎస్‌. ప్రకాష్‌రావు, తెలంగాణ ప్రెసిడెంట్‌ మెడల్‌ పొందారు.

తెలంగాణ నుంచి ఎస్ఐ దామోదర్‌రెడ్డి,కి ప్రెసిడెంట్‌ మెడల్‌ పీఎస్‌ఎం దక్కింది. అలానే మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్ విభాగంలో 12 మంది ఎంపికయ్యారు. ఐజీ సుమతికి మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డు లభించింది. ఎంఎస్‌ఎం ఫైర్‌ విభాగంలో ముగ్గురికి అవార్డులు దక్కాయి.

ఎంఎస్‌ఎం హోంగార్డు, సివిల్‌ డిఫెన్స్‌ విభాగంలో ముగ్గురు, ఎంఎస్‌ఎం కరెక్షనల్‌ సర్వీస్‌ విభాగం ఇద్దరు అవార్డులకు ఎంపిక య్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఎస్‌ఎం కరెక్షనల్‌ సర్వీస్‌ విభాగంలో ముగ్గురు, మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్ విభాగంలో 15 మంది అవార్డు అందుకో నున్నారు.

04 Feb 2026

Leave a Comment