ఖమ్మం భూదాన్ భూముల కవరేజ్‌కు వెళ్తుండగా ‘తొలి వెలుగు’ జర్నలిస్ట్ రఘు అరెస్ట్….

On: Wednesday, February 25, 2026 3:10 PM

నకిరేకల్ (నల్గొండ జిల్లా) నుండి ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా “తొలి వెలుగు” జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కేతేపల్లి మండలం లోని కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద భూదాన్ భూముల సమస్యల కవరేజ్ కోసం ఖమ్మం వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

తదుపరి వారిని శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.

ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల సమస్యలపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోం

ది.

25 Feb 2026

Leave a Comment