నగరశివారులో చిరుత సంచారం!

On: Monday, July 14, 2025 10:27 AM

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్‌ ప్రాం తంలో ఉన్న వాటర్‌ ట్యాక్‌ కింద ఓ బండరాయిపై చిరుత ఉండడాన్ని గమనించిన కాలనీవాసులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్‌ ప్రాం తంలో ఉన్న వాటర్‌ ట్యాక్‌ కింద ఓ బండరాయిపై చిరుత ఉండడాన్ని గమనించిన కాలనీవాసులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కొందరు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

 

చిరుత సంచారం విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ నార్త్‌ ఎఫ్‌ఆర్‌వో సంజయ్‌ గౌడ్‌ తమ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్‌ సాయంతో చిరుత కోసం 300 క్వార్టర్స్‌ ఏరియాలోని పరిసర ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఎవరూ ఇండ్లలో నుంచి బయటికి రావొద్దని ఎఫ్‌ఆర్‌వో సంజయ్‌ గౌడ్‌ సూచించారు.

ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో..
ఏడాది క్రితం సైతం నాగారం శివారులోని ఇదే ప్రాంతంలో ఇండ్లకు దగ్గరలో ఓ బండరాయి పై చిరుతను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చా రు. చిరుత సంచారం దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా అవిసామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

 

23 Jul 2025

Leave a Comment