హైదరాబాద్ :ఆగస్టు 11
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని వీధి కుక్కలను ఫిల్టర్లు కు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వీధి కుక్కల బెడద కుక్క కాటు రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం వల్ల ఆందోళన వ్యక్తం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది, ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉన్న అన్ని వీధి కుక్కలను గుర్తించి, వారం లోపు తరలించాలని సూచించింది.
ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆందోళ నలను ప్రతిబింబించాయి. ముఖ్యంగా రేబిస్‌తో చనిపోయిన వారిని ఎవరు తిరిగి తీసుకు వస్తారని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. వీధి కుక్కల బెడద కేవలం ఒక ఇబ్బందికరమైన అంశం మాత్రమే కాదని.. అది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన ప్రజా భద్రతా సమస్య అని సుప్రీం కోర్టు పేర్కొంది.
వీధి కుక్కలు, వాటిని పెంచుకునే ప్రజల హక్కుల మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయ పడింది. కానీ మనుషుల ప్రాణాల కంటే జంతువుల సంక్షేమం ముఖ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏదైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.







