A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన తలారి జమున ఈ నెల 15వ తేదీ రోజు తన ఇంటికి తాళం వేసి జుక్కల్ గ్రామానికి చిన్న కొడుకు వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
బీరువాను, పగలగొట్టి, అందులో ఉన్న సుమారు 10 తులాల బంగారు నగలు మరియు కొంత నగదును అపహరించి పరారయ్యారు. విషయం తెలవగానే తిరిగి ఇంటికి వచ్చిన జమున ఈ ఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.








