కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్టు గ్రామ సర్పంచ్ గాజుల నవీన్ కాళీ

On: Tuesday, December 16, 2025 9:02 PM

A9 న్యూస్ మాక్లూర్:

మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి గాజుల నవీన్ కాళీ మరియు ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

అలాగే మెట్టు గ్రామంలో వార్డు సభ్యులుగా గెలుపొందిన విజయ శాంతి, సత్య కల్యాణి, బూర్గుల యాకుబ్, వెంకటేశ్వర్లు, బుంగ అబ్రహం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.టి.సి నాయకులు నగేష్, విట్ఠల్ రావ్ తదితరులు పాల్గొని, పార్టీలో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని నూతనంగా చేరిన నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

03 Mar 2026

Leave a Comment