చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….

On: Thursday, August 28, 2025 8:34 PM

 

జక్రాన్‌పల్లి, ఆగస్టు 28:

జక్రాన్ పల్లి మండలంలోని

పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు కట్టపైకి చేరుకున్న ప్రజలు ఉత్సాహంగా సందర్శించారు. నీటి అలలు కట్టమీదుగా పారిపోతూ అందమైన దృశ్యాన్ని సృష్టించగా, చిన్నా పెద్దా అందరూ కుంట దృశ్యాన్ని ఆస్వాదించారు. ఎన్నేళ్ల తర్వాత చెరువు అలుగు పారడం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.

15 Mar 2026

Leave a Comment