జి.జి. నడుకుడా గ్రామంలో ఘనంగా నూతన సర్పంచ్ ప్రమాణస్వీకారం…

On: Tuesday, December 23, 2025 10:00 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

జి.జి. నడుకుడా గ్రామ నూతన సర్పంచ్‌గా బట్టు సంజీవ్ రాజ్ గారు ఈరోజు ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన బట్టు సంజీవ్ రాజ్ గారు, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాల మెరుగుదలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగేలా పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజల సహకారంతో జి.జి. నడుకుడా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొంటూ, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

13 Mar 2026

Leave a Comment