A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన గ్రేడ్–వన్ అధికారి శ్రావణి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ భేటీలో కాంగ్రెస్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణ పరిధిలోని 30వ, 29వ మరియు 13వ వార్డుల్లో తలెత్తుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను వివరించారు. ముఖ్యంగా డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకొని, పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్‌ను కోరారు.
ఈ సమావేశంలో 13వ వార్డు ఇంచార్జ్ కన్నం లక్ష్మణ్, 30వ వార్డు ఇంచార్జ్ పింజా అభినవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నం ప్రసాద్, పసుపుల నరేష్, గుంజల సుమన్, పింజ రాజశేఖర్ (సన్నీ) తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు సూచించిన సమస్యలను పరిశీలించి, దశలవారీగా పరిష్కారానికి చర్యలు చేపడతామని నూతన కమిషనర్ శ్రావణి హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.






