హైదరాబాద్:డిసెంబర్ 13
పురాణాల ప్రకారం… గోదావరి పుష్కరాలు ప్రతి ఏటా 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం బృహస్మతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి, పుష్కరాల సమయంలో గోదావరి నది లో స్థానం చేయడం, పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం, అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు నది తీరాలకు చేరుకొని పుణ్య స్థానాలు ఆచరిస్తారు. దానాలు, పూజలు,నిర్వహిస్తారు.
గోదావరి పుష్కరాల తేదీలు ముహూర్తం గురించి టిటిడి ఆస్థాన సిద్ధాంతి ఆగమ వైదిక పండితులు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు వివరాలు అందించారు. కమిషనర్ నివేదిక ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత దేవాదాయ శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రెటరీ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు పుష్కరాలు మొత్తం 12 రోజులు ఉంటాయి మరియు మొదటి రోజున పుష్కర ఆరంభం ఆద్య పుష్కరం అంటారు.
పుష్కరాల తేదీలను తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభి ప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తూ.. అందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు మొత్తం 12రోజులు జరగనున్నాయి. జూన్ 26వ తేదీన పుష్కరాలు ప్రారంభం అవుతాయి. జులై 7వ తేదీన పుష్కరాలు ముగుస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీచేశారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించిన తేదీలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో.. తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది..







