గుత్ప తండా అభివృద్ధే లక్ష్యంగా – రామావత్ సురేష్ హామీ….

On: Sunday, December 14, 2025 1:47 PM

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

గుత్ప తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రామావత్ సురేష్ తండా అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా చేసుకొని ప్రజల ముందుకు వచ్చారు.

రేషన్ షాపు ఏర్పాటు, అంతర్గత రోడ్ల అభివృద్ధి, వృద్ధులు–వికలాంగులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మంజూరు, మంచినీటి సరఫరా పటిష్టత, వడ్ల కొనుగోలు కాంటా కల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తండా అభివృద్ధిని తన బుజస్కందాలపై వేసుకొని, తండా ప్రజల సహకారంతో, అందరినీ కలుపుకొని పోయే నాయకత్వంతో గుత్ప తండాను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఈ సందర్భంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తండా ప్రజలను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, తన యొక్క విన్నపం మరియు పాదాభివందనాలు తెలిపారు.

14 Mar 2026

Leave a Comment