విజయవంతంగా గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్….

On: Monday, January 26, 2026 9:04 PM

కీ||శే|| తాళ్ల గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిని ఐకాన్ యూత్, రెండో బహుమతిని ఫ్రెండ్స్ యూత్ జట్టు కైవసం చేసుకుంది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట నరసయ్య గారు, అలాగే గ్రామ వార్డు సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గంగాధర్ గౌడ్ గారు క్రీడల్లో ముందుండే వ్యక్తి, క్రీడలపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేదని తెలిపారు. ముఖ్యంగా ఆయన ఒక మంచి కబడ్డీ ప్లేయర్ అని గుర్తు చేశారు.

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించి, క్రీడల్లో ముందుకు సాగాలని వారు ప్రోత్సహించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

04 Feb 2026

Leave a Comment