అధికారులకు షాకిచ్చిన సామాన్యుడు..

On: Monday, July 7, 2025 9:14 PM

 

సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తాళం

ప్రభుత్వాధికారులకు ఓ సామాన్యుడు షాకిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంటుంది.

గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన ఇంటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. అయితే, 2022 నుంచి ఇప్పటి వరకు ఆఫీసుకు సంబంధించి అద్దెను అధికారులు చెల్లించడం లేదు. ఈ విషయంలో రాజు తనకు రావాల్సిన అద్దెను ఇప్పించాలంటూ పలుమార్లు మోర పెట్టుకున్నాడు.

ఉన్నతాధికారులను కూడా కలిశాడు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ ఉదయం రాజు కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా తాళం వేశాడు. అద్దే చెల్లించేంత వరకు తాళం తీసేది లేదని.. మూడున్నరేళ్ల బాకాయిలను వెంటనే చెల్లించాలని భీష్మించుకు కుర్చున్నాడు. అయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం వేయడంతో ఆయా రిజిస్ట్రేషన్లకు ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న జనం ఆఫీసు బయటే నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అయినా, కార్యాలయానికి ఇళ్లు తీసుకుని అద్దె చెల్లించకపోవడం ఏంటని అధికారులపై పలువురు మండిపడుతున్నారు..

25 Jul 2025

Leave a Comment