తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం : కత్రాజీ విష్ణు…

On: Saturday, January 31, 2026 4:40 PM

 

ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్ భవనంలో కత్రాజీ విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా. విష్ణు మాట్లాడుతూ, తనపై బంగారు వ్యాపారి కోమన్ పల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

తాను కోమన్ పల్లి శ్రీనివాస్‌కు ఎలాంటి డబ్బులు ఇచ్చేదిలేదని, ఇద్దరం కలిసి వ్యాపారం నిర్వహించామని తెలిపారు. తన తండ్రి అనారోగ్య పరిస్థితి కారణంగా తరచూ ఆసుపత్రులకు తిరగాల్సి వచ్చిందని, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అనవసర ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికే తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

పోలీసులకు, సీపీకి తమపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతూ, అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా దాడులు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బొంబాయి‌కు చెందిన బంగారు వ్యాపారితో వ్యాపారం చేసి నష్టపోయిన కోమన్ పల్లి శ్రీనివాస్, ఆ నష్టాన్ని తమపై నెట్టివేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అంతేకాకుండా, ఆర్మూర్‌లో కోమన్ పల్లి శ్రీనివాస్ నకిలీ హలోగ్రామ్‌తో బంగారు వ్యాపారం నిర్వహిస్తున్నాడని కూడా కత్రాజీ విష్ణు ఆరోపించారు.

04 Feb 2026

Leave a Comment